గొప్ప మనసు ; - :బి. నిఖిల్ చరణ్, 9వ తరగతి జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీం నగర్, మండలం చిన్నకోడూరు, జిల్లా సిద్దిపేట. సెల్ నెంబర్.6300203158
 కస్తూరి పెళ్లి అనే గ్రామంలో ఒక పేదాయన తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ పెదాయన పేరు శివయ్య. శివయ్యది చాలా పేద కుటుంబం. శివయ్యకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. శివయ్య కొడుకు పేరు శ్రీను. శీనుకి చదువు అంటే చాలా ఇష్టం. శీను వాళ్ళ చెల్లి పేరు రమ. రమ తన అన్న శీనుతో రోజు బడికి వెళ్ళేది. శివయ్య వ్యవసాయం మరియు రకరకాల కష్టంచేస్తూ ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చేవాడు. కుటుంబాన్ని సాకేవాడు. అలా కొన్ని సంవత్సరాల తరువాత శీను వాళ్ళ తండ్రి శివయ్య చనిపోతాడు. 
శివయ్యకు ఒక కోరిక ఉండేది. తన బిడ్డ అయినా రమకు పెళ్లి చేయాలనుకున్నాడు. శీను కష్టపడతాడు. పని చేసుకుంటూ చదువుతాడు. ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది. శీను ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ తన చెల్లి పెళ్లికి కావాల్సిన డబ్బులు కూడపెడుతున్నాడు.  తను తెలివితో, నిజాయితీతో కష్టపడ్డాడు. ‌ చాలా ధనవంతుడు అయ్యాడు. శీను తన చెల్లి అయిన రమకు పెళ్లి చేస్తాడు.  
  శీను కొన్ని సంవత్సరాల్లోనే ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అని అనుకుంటాడు. సురేష్ కుట్రతో శీనుని దెబ్బతీయాలనుకున్నాడు. 
 ఒకరోజు రాత్రి శీను పడుకున్నప్పుడు సురేష్ దొంగ చాటుగా వచ్చి చూస్తాడు. అక్కడికి వచ్చి శబ్దం చేస్తాడు. శీనుకి  మేలుకో వస్తుంది. 
విలువైన వస్తువులు కొన్ని కనబడడం లేదు. ఆభరణాలు మాయమయ్యాయి. అంతలోనే అక్కడ ఒక ఫోన్ కనబడ్డది. ఇల్లంతా తిరిగి ఏమేమి వస్తువులు కోల్పోయాడో పరిశీలిస్తాడు. బాధపడతాడు. ఈ ఫోన్ సురేష్ ది కదా ఇక్కడికి ఎలా వచ్చింది?" అని శీను ఆలోచించసాగుతాడు.
 
 తరువాత ప్రొద్దున్నే పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు ఎంక్వయిరీ చేస్తారు.
 ఎంక్వయిరీలో సురేష్ ఇంటికి వస్తారు. 
పోలీసులు సురేష్ ని "నీ ఫోన్ ఎక్కడ అని అడుగుతారు.' 
 "నా ఫోన్ నా దగ్గరనే ఉంది" అని సురేష్ అంటాడు. 
"ఏది చూపించు" అని పోలీసులు అడుగుతారు. అంటే సురేష్ లోపలికి వెళ్లి "అటూ ఇటూ చూస్తూ నా ఫోన్ నిన్న రాత్రి ఇక్కడే పెట్టాను కనబడుటలేదు సార్" అని అంటాడు. 
"నీ ఫోన్ మా దగ్గరనే ఉంది. నువ్వు నిన్న రాత్రి శీను వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వచ్చావో మాకు తెలుసు. మర్యాదగా చెప్తే సరి లేదంటే నిన్ను జైల్లో  వేయవలసి వస్తుంది"అని ఎస్సై అన్నాడు.
   "శీను  కొన్ని సంవత్సరాల్లోనే ఎలా  ధనవంతు అయ్యాడో తెలుసుకుందామని వచ్చా. విలువైన బంగారు ఆభరణాలు అక్కడ కనబడితే తీసుకెళ్లి అమ్మాను. అంతకుమించి నేనేం దొంగతనం చేయలేదు సార్." అని సురేష్ అన్నాడు.
"సారీ సార్ పరుల సొమ్ము పాము తెలుసుకున్నాను. ఇక ముందు ఎవరి మీద ఈర్ష అసూయాలతో ఉండను. నన్ను క్షమించండి" అని వేడుకుంటాడు. 
తీసుకెళ్లిన వస్తువులన్నీ శీనుకు అప్పగిస్తాను నామీద కేసు చేయొద్దని బతిలాడాడు. అందుకు శీను క్షమిస్తాడు.
 పోలీస్ లు కూడా ఒప్పుకుంటారు. సురేష్ తన తప్పు తెలుసుకుంటాడు.

కామెంట్‌లు