గణతంత్ర దినోత్సవం ;- డి.వినాయక్ రావు, భైంసా, 9440749686
 1.కం:గణతంత్ర దినోత్సవమా
ఘనముగ విజయమ్ము లిమ్ము కమలాలయవై
జన హక్కలు కాపాడుమ
ప్రణమున్ లేకుండ మమ్ము పరిపాలించూ
2.కం:గణతంత్ర దినోత్సవమున్
ఘనముగ జర్పంగ ఛాత్ర కార్యోన్ముఖులై
వినయ విదేయత జూపుతు
ప్రణమిల్లిరి జండ పాట పరికీర్తించన్

కామెంట్‌లు