తరువులు(బాలగేయం);- రావిపల్లి వాసుదేవరావు-విజయనగరం-9441713136
తరువుల నడుమ తిరిగి
స్వచ్ఛ గాలి పొందాను!
ఆరోగ్యం తో పాటు
ఆనందం పొందాను!

మొక్కలను విరివిగాను
ఇష్టంతో పెంచాను!
ఇలపైన వర్షాలు
కరువుతీర పొందాను !

చెట్ల కొమ్మలు నే
సమిధలుగా వాడాను!
యజ్ఞ యాగాలు చేసి
పుణ్యం నే పొందాను!

ఆకులపై ప్రసాదము
భక్తితో తిన్నాను!
ఆకలి నను వీడగా
సంతృప్తిని పొందాను!

వృక్షాలను వసుధపై
నే సంరక్షించాను !
ప్రత్యక్ష దైవంగా
నే ఆరాధించాను!

పూవులను దైవానికి
భక్తితో అర్పంచాను!
దైవలీలకు నేను
పాత్రుడినే అయ్యాను!

కామెంట్‌లు