కైకేయి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణివిజయవాడ కేంద్రం,9492811322

 కానీ దశరథుడు మాట తప్పు వాడు కాదు అనే ధైర్యం కూడా ఉంది ఈ సందర్భంలో సూర్యుడు ఆకాశం పగలు రాత్రి దశదిశలా అన్ని దేవతల సాక్షిగా కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల సంగతి గుర్తు చేసింది రాముని బదులు భరతుని పట్టాభిషేకం రాముని వనవాసం ఇవే ఆ రెండు వరాలని వాటిని ప్రసాదించమని కోరింది దశరథుడిని. ఈ భయంకర కోరికను వినగనే దశరధుడు మూర్చ వెళ్ళాడు కొద్దిసేపటికి లేచి దూషిస్తూ హృదయహీనురాలని నిందిస్తూ విలపింప సాగాడు దశరథుడు లోకం సూర్యుడు లేకుండా మనగలదా నీరు లేకుండా లతలు పచ్చగా ఉండగలవా నేను రాముడు లేకుండా జీవించలేను అని అంటూ సత్య ధర్మ పరిపాలకుడైన దశరథ మహారాజు తన కైకేయి కిచ్చిన వరాల సంగతి గురించి ప్రస్తావిస్తాడు  నేను ఆడిన మాట తప్పలేను. ఒకవైపు పుత్ర ప్రేమ మరొకవైపు వచన భంగము ఈ రెండింటి మధ్య మానసిక చిత్రహింసతో దశరథుడు పుత్ర ప్రేమ కంటే వచన పరిపాలనయే మిన్నగా భావించాడు దశరథుడు  భరతునికి పట్టాభిషేకం సరేగాని రామునికి వనవాసం అందుకే వాడి తండ్రిగా ఇది ధర్మసమ్మతం కాదు కదా ఇది మీమాంస కైకే రాజీ పరచకుండా తన సత్య ధర్మ పరిపాల చేయలేదు అందుకే  దశరధుడు కైకై పాదాలపై పడి తనను సత్య ధర్మ పరిపాల కొనసాగాలి రామునికి ఇలాంటి కఠిన శిక్ష తగదు దుష్ట వ్యవహారానికి అర్హుడు కాదు అందుచేత కైకయిని రెండోవరాన్ని మరో విధంగా కోరుకోమని అడుగుతాడు దశరథుడు త్యాగం తపస్సు కృతజ్ఞతలు అయిన శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పిన నేను శ్రీరాముని వనవాసానికి పంపే సాహసం చేయలేను అని అంటాడు. ఇలా కైకేయి ముందు ఒక వాస్తవిక సంఘర్షణ తలెత్తింది దశరధుడు ఇచ్చిన రెండు వరాలను వెనక్కి తీసుకోలేడు తాను ఇచ్చిన వరాన్ని పాటించడమే సత్య ధర్మ సమ్మతంగా చెప్తుంది తన వరాలను అంగీకరించకుంటే తన ప్రాణత్యాగం చేసుకుంటానని కైకై దశరథ ప్రకటనగా చెప్తుంది రాజు సంకటి స్థితిలో పడ్డాడు నిస్సహాయుడై కైకేయి భుజం మీద తూలి రోదిస్తున్నాడు కైకేయి ఏ మాత్రం దశరథని పేరు ప్రతిష్టాలను గురించి కానీ ఆయన ప్రేమ గురించి గానీ ఒక క్షణం కూడా ఆలోచనకు రానీయకుండా నిశ్చలంగా 
స్థిరంగా ఉంది తన నిర్ణయాన్ని పునర్ ఆలోచించమని ఇది సూర్యవంశ రాజ్య పరిపాలన భవిష్యత్తు చేసే కార్యం కనుక కైకయి ప్రాధేయపడి మరల అడిగాడు దశరథ మహారాజు.
కామెంట్‌లు