ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నాటకాన్ని మరొకసారి వినిపించి  ఏ పదాన్ని ఎక్కడ ఎలా చెప్పాలి  సమతూకంగా ఇటు భక్తిని అటు  ఆత్మాభిమానాన్ని  తులనాత్మకంగా చేయించగలగాలి  అని చెప్పి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత  ప్రదర్శన జరిగింది  దానికి నన్ను వెంకటేశ్వరమ్మ గారిని నాన్నగారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు  దాని పూర్వపరాలన్నిటినీ కూడా నాన్నగారు వేదికపై వివరించడం  అందరూ నాకు అభినందనలు తెలియజేయడం  నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం  ఇలా ఎన్ని కార్యక్రమాలు జరిగాయో చెప్పడానికి వీలు లేదు  అలాంటివాడు  అనుకోకుండా    కోవిడ్ వ్యాధికి గురై  అకాల మరణం పొంది  మాలాంటి ఆత్మీయులందరికీ దూరమైన అతని జ్ఞాపకాలు మాత్రం  శాశ్వతంగా మా మనసుల్లో నిలిచి ఉన్నాయి. ఒకరోజు అనుకోకుండా సినీనటి అంజలీదేవి గారు విశాఖపట్నం రావడం  ఆయనను కలిసి రేడియోలో వారి  పరిచయ కార్యక్రమానికి  ఆహ్వానిస్తే ఆమె అంగీకరించడం  ఆమెను పరిచయం చేయడానికి ఆమెతో అంతకముందే పరిచయం ఉన్న  అచ్యుతరామరాజు గారిని పిలిచి వారితో ప్రశ్నలు  అడిగించాను. ఆమె సినీ రంగ ప్రవేశాన్ని గురించి  ఆవిడ  వచ్చిన కొత్తలో రంగస్థలం నుంచి ఒకేసారి  సినీ రంగానికి రావడంతో దీనికి అలవాటు పడడానికి ఆమె ఎంత కష్టపడిందో  ఎంత సాధన చేసిందో తెలియజేసింది. ఇతర నటీనటులతో తనకున్న సహచర్యం  తన సంస్థలో మిగిలిన వారిని ఆహ్వానించినప్పుడు  వారికి తాను ఇచ్చే  గౌరవ మర్యాదల గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చింది  ఆ కార్యక్రమం ప్రసారమైన తర్వాత అనేక మంది శ్రోతలు అభినందిస్తూ ఉత్తరాలు కూడా రాశారు. ఒకరోజు నాన్నగారు కబురు చేసి  ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఉంది హనుమంతరాయ గ్రంథాలయంలో సాయంత్రం అక్కడికి రమ్మన్నాడు  నాన్నగారు వచ్చేటప్పటికి నేను అక్కడికి చేరుకున్నాను  ఏ ఆర్ కృష్ణ గారు  శకుంతల నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు  అనేక ప్రాంతాలలో  ప్రదర్శించిన తర్వాత విజయవాడ వచ్చి మొదటిసారిగా  ఆ నాటకాన్ని చూపించడం  విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు  ఏమి జరిగినా ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు  రామ్మోహన్ రావు గారు అధ్యక్షుడిగా వచ్చేవారు  కానీ ఆరోజు నేను విశాలాంధ్రలో సంపాదకులుకా పనిచేస్తున్న రాఘవాచారి గారిని మొదటిసారిగా చూశాను ఆరోజు కృష్ణంరాజు గారు కూడా  ఆరోజు కార్యక్రమంలో  ప్రత్యేక ఆకర్షణగా అరుణా వ్యాస్  ఆహ్వానితురాలుగా  వచ్చారు వ్యాస్ గారి భార్యగా  పిలిచారు అని అనుకున్నారంతా.
కామెంట్‌లు