ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 స్వామి అనుగ్రహించి తన చెంత చేరి తన జబ్బ పట్టుకొని  నీకు మోక్షాన్ని  ప్రసాదిస్తాను  అంటే వీడు అంటే నన్ను వదిలి  ఆ ముందు త్వరగా వెళుతున్నాడే వాడిని పట్టుకో వాడికి ఆ మోక్షం ఇవ్వు నాకు వద్దు  అనే అర్థం  దానిలో ఉంది  వెంకటేశా  అన్న పేరుతో వారిని   కొలుస్తున్న భక్తులకు  దాని అర్థం తెలియదని  నాన్నగారు దానికి వివరణ ఇచ్చారు  వెంకట అంటే పవిత్రత అని అర్థం  వేం అంటే పాపాలను కట తొలగించేవాడు  ఈశా అంటే ప్రతిచోట ఉండేటువంటి  దైవ స్వరూపం  వృషభాద్రి నుంచి నీలాద్రి ప్రయాణం చేశాడు  ఆయాత్రికుడు,  ప్రాణమయమైన నీలాద్రి పాదములను ఆశ్రయించితి నందు నీవు వుందు వనుచు వెతికి చూచితి  నీలంపు వెలుగు తప్ప కనరావైతి విధి ఏమి కరుణ లేదె నీలం రంగులో కనిపిస్తూ ఉంటుంది కనుక దానిని నీలాద్రి అన్నారు  వెంకటేశ్వరుడు నీలం రంగులోనే ఉంటాడు.
తీరా అక్కడ చూస్తే  ఆ రంగులో ఆయన కనిపిస్తాడు అని ఎంత వెతికినా  నీలపు రంగు తప్ప మరెక్కడ ఎవరు కనిపించలేదు. ఇంత వెతికినా కనబడటం లేదు నా మీద నీకు జాలి  దయ లేదా అని ప్రశ్నిస్తున్నాడు  అక్కడ నుంచి అంజనాద్రి కి బయలుదేరాడు  హనుమంతుని తల్లి అంజని  ఆమె కుమారుడు కనక  ఆంజనేయులు  ఆ పేరుతో ఉన్న గిరి  అలసి చేరితి మనోమయ మంజునాద్రి చెట్టు పుట్టల గుట్టల చేరి వెతుకు చెదరి బెదరుచునున్నది చిత్తమేమొ ఎట్లు నేను చేరగలని శ్రీ వేంకటేశ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ తో కలిసి ఉండడం వల్ల శ్రీ వెంకటేశ అన్న శబ్దాన్ని వాడారు  అంజనాద్రి కి వెళ్లి అక్కడ  కనిపించిన చెట్టు పుట్టలను గుట్టలను అన్నిటినీ వెతికాడు. అక్కడ ఏది కనిపిస్తుందో అని బెదిరిపోతూ   భయంతో మనసుని చిక్క పట్టుకొని  అక్కడికి వెళ్లినా కనిపించకపోయేసరికి  స్వామి నేను ఎలా చేరాలని వారిని ప్రశ్నిస్తున్నాడు. ఆ తర్వాత గరుడాద్రిని చేరడానికి బయలుదేరాడు  విసిగి వేసారి విజ్ఞానమయపుదారి కదలి చేరితి గరుడాద్రి పక్షములకు   దేవి గగనం మార్గము బట్టి వెతకి చూసి నీవెందుకనరావు  అప్పటికే విసిగి వేసాగిపోయాడు  అదేదో విజ్ఞానాన్ని కలిగించే దారి అని అక్కడికి వెళితే  తన రెక్కలతో  భక్తుని పట్టుకొని పైకి ఇలాగే కనిపిస్తూ ఉంటుంది  దీనిని మోకాళ్ల పర్వతం అని కూడా అంటారు  పైకి లాగే దృశ్యం కనిపిస్తూ వుంటుంది.వారి కోసం  వచ్చి నడవవలసిన స్థితి  అంత కష్టపడి అక్కడికి వెళ్లి వెతికి చూసినా  ఎక్కడా నీవు నాకు కనిపించలేదు కారణం నాకు అర్థం కావడం లేదు  అని శేషాద్రికి  బయలుదేరాడు  కానీ ఆనందమదియేమో గగనమంత నిండి కుండలి నీ కన్య నాట్యమాడ వేయి పడగల శేషాద్రి వెలుగ సాగె గాని నిరూపు గనరాదు కార్యమెమో.

కామెంట్‌లు