కౌసల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కౌసల్య దూషణ  పర్వం ముగిసే వరకు  వేచి ఉండి దశరథుడు తుదకు దుష్కార్యానికి క్షమాపణ కోరుతాడు ఈ విధంగా పతిని దూషించినందుకు కౌసల్య సిగ్గుపడుతుంది చివరకు చల్లబడింది తన భర్తను ఇలా దూషించడం నేరమేనని తలచింది ఎందుకనగా దశరథుడు ఇప్పటికే రాముని వివేకంతో మహా విషాద యోగంలో కొట్టుమిట్టాడుతున్నాడు అటువంటి మానసిక స్థితిలో ఉన్న భర్తను తూలనాడి మాట్లాడడం నేరంగానే కౌశల్య భావించింది వాల్మీకి తన ఈ మహాకావ్యం లో కనపరిచిన చతుర శిల్ప నైపుణ్యం ఏమిటంటే రెండు భావ సంఘర్షణలను చూపించి వాటిని సమన్వయ పరుస్తూ విశేషమానవీయ్య దృష్టి కోణాన్ని ఆవిష్కరిస్తాడు ఒక  యదార్ధ పరిస్థితిని ప్రతిబింబించే విధంగా రచనాత్మక ధోరణి ప్రదర్శిస్తారు వాల్మీకి మహర్షి  ధోరణిని  ప్రదర్శిస్తాడు  వాల్మీకి మహర్షి.
రామవియోగ జనిత సంవేదన తీవ్రత కౌసల్య తన భర్త పట్ల చూపవలసిన కర్తవ్యతా దృష్టిని కూడా మరల్చింది తల్లి పుత్రవియోగ క్షోభ గమనించిన దశరథుడు తన దుఃఖాన్ని జయించలేకపోయాడు ఆ కారణంగానే దశరథుడు తనువు చాలించాడు అపవాదుకు కారణ భూతుడు కాకుండా ఉండేందుకు భరతుడు తండ్రి దహన సంస్కార బాధ్యతలు నెరవేర్చుటకు అయోధ్యకు తిరిగి వచ్చాడు ఒక నిష్కంఠకంగా రాజ్యపాలన చేసుకోవచ్చు అని అంటుంది ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వాన్ని తెలుపుటకు చేసిన ప్రయత్నాలు కౌసల్య అర్థం చేసుకున్నది కౌసల్య  కౌసల్య భరతుని ఆదెంగనం చేసుకొని భర్త నీవు రాముడి కంటే కూడా ఉదార స్వభావుడవయ్యా అని పలికింది. భరతునితో కలిసి కౌసల్య చిత్రకూటమి కూడా వెళ్ళింది శ్రీరాముడు తిరిగి రావలెను అనే ఉత్కంఠ భరతునకు అధికంగా ఉంది కానీ సత్య నిష్టుడైన రాముడు తండ్రిని మించిన వాడని భర తుడుని  తెలుసు. భరతునికి శ్రీరాముని పై ఉన్న అపార ప్రేమ అందరికీ తెలిసినదే ఈ ఆదర్శ ఉధార ప్రేమ భావాలు తల్లి కౌసల్య నుండి కుమారులకు సంకల్పించిన సర్వ శ్రేష్ట సంపదగా భావించారు చిత్రకూటమిలో కౌసల్య ప్రశాంతంగా ఉంది ఎటువంటి ఉద్వేగం ఆమెలో కనిపించలేదు కౌసల్య పూర్వ స్థితిలో ఉన్నట్లే ఇప్పుడు మనం దర్శించవచ్చు అందరి స్వరూపిణిగా కనిపిస్తోంది మానసిక ఆధ్యాత్మిక సమతుల్యాన్ని సాధించి కౌసల్య శ్రీరాముని పట్ల ఎంతటి ప్రేమ స్నేహభావాలు కలిగి ఉన్నదో అదే విధంగా భరతుని ప్రేమించింది చివరకు రాక్షస సంహారం చేసి శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నాడు కౌసల్య విధి పరిణామాల్ని తలంచుకుని మౌనంగానే  ఉన్నది శ్రీరాముడు కౌసల్య పాదములకు నమస్కరించాడు అప్పటికీ ఆమె మౌనంగానే ఉన్నది ఇంతలో క్రమంగా ఆమె  శరీరపు రంగు మారింది.

కామెంట్‌లు