ఏక సంధాగ్రహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రామరాజు ప్రతి పల్లెకు వెళ్లి అక్కడ పెద్దలను కలిసి  నిజాయితీపరులను ఎన్నుకొని వారిని గ్రామ పెద్దలుగా నియమించి  ఆ గ్రామంలో ఏ తగాదాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా  ఈ పెద్దల సమక్షంలో వారు చెప్పుకుంటే ఆ బాధలన్నీ తీర్చే బాధ్యత వీరు తీసుకునేలాగా ఏర్పాటు చేశారు  దానితో కాంట్రాక్టర్ల మధ్య భోక్తలుగా చేరి వారి కమిషన్ తో వీరు కడుపులు కొడుతున్న దుస్థితి మారిపోయింది  ఏ కేసూ కోర్టుకి వెళ్లకపోవడంతో  అక్కడ లాయర్లు  వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు  ప్రతి గ్రామంలోనూ కూలీలందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వారి  న్యాయమైన కోరికలను తీర్చవలసినదిగా  కామందులను కోరడంతో   గ్రామంలో ఉన్న సమస్యలన్నీ  సమసిపోయినాయి. అలా మన్యంలో ఉన్నవారికి జీవితాలను మార్చిన వారు సీతారామరాజు. ప్రతి ఇంటికి వెలుగులు వచ్చాయి. వారు కన్న కలలను తీర్చుకోవడానికి అవకాశం కల్పించాడు రాజు  రాజు బోధలు విన్న  మన్యం మొత్తం రామరాజ్యంగా మారిపోయింది. ఇక్కడ మన మాటలు చేతలు  ఇతరుల మాటలు వినే స్థితిలో వారు లేరు వారిని అంతగా ప్రభావితం చేశాడు రామరాజు  రామరాజు అంటేనే మన్యపు రాజు అని పేరుగాంచాడు  వారందరికీ కూడా అతడు దేవుడయ్యాడు  మన్య సంపదలు మనకు దక్కవు అంటూ ఈ దళారులు ఎంతో బాధపడుతూ  రాజును ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో  రామరాజును అరెస్టు చేయించారు. రామరాజును అరెస్ట్ చేసి నర్సీపట్నం తీసుకొచ్చిన పోలీసులను నిలదీసిన  రామరాజు  కారణం లేకుండా ఇక్కడకు తీసుకు వస్తారా  హేతువు ఏదో చెప్పండి  అని అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారు  మన్యంలో మేము వస్తే  మమ్మల్ని ఖాతరు చేయడం లేదు  నీవు అక్కడ  ఏ విషయంలో జోక్యం చేసుకోకూడదు. అది నీకు మాకు మాత్రమే సంబంధం. ఇక్కడ కావలసిన అంత మాన్యాన్ని ఇస్తాం ఎక్కడ కావాలో ఎంత కావాలో కోరుకో  అది తీసుకో తర్వాత మాకు సన్నిహితంగా ఉండి మాకు కావలసిన ఏర్పాట్లు మాకు చేస్తూ ఉండాలి  ఎంతో అంటూ ఎంతో బుజ్జగింపులు జరిపిన అధికారులను చూసి రామరాజు వారి నీచమైన ఎత్తుగడలను విని నవ్వుకుంటూ.


కామెంట్‌లు