ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;--ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రాజమండ్రి రాజ వీధిలో వెళుతున్న ఒక ఆంగ్ల సైనికుని చూసి ప్రజలు తలలు వంచారు దానిని చూసి రాజుగారు కూడా తలవంచటానికి ప్రయత్నం చేస్తే  తన తండ్రి  స్వేచ్ఛకై పోరాడు చారిత్రక శక్తి మనది పరుల కొమ్ము కాయడం కాదు చేతనైనంత చావగలిగినంత పోరాడవలె స్వేచ్ఛ పొందు వరకు  అన్న బీజాన్ని నాటారు. గ్రంథాలయాలలో ఉన్న భారత భాగవతాది భారత గ్రంథాల  అన్నిటిని చదివి  సంస్కృతం కూడా నేర్చుకోవాలని అభిలాషతో కాశి వెళ్లారు రాజుగారు  అక్కడ శ్రద్ధగా చదువుతున్న  విద్యార్థిగా  అందరి మన్ననలను పొందిన వాడు ఒకరోజు వారి  కులం తెరిచి భారత చరిత్రలో కర్ణునకు  ఎలాంటి అవమానం జరిగిందో వీరికి అలాంటిదే జరిగేసరికి  పట్టు విడువక గోడ వెనుక నిలచి  గురువుగారు చెప్పిన పాఠాల్ని నేర్చిన పట్టుదల గల వ్యక్తి మన సీతారామరాజు గారు.
రాజు గారిని శిక్షించ దలచిన గురువు గారిని  నేరము మోపగా నా నేరమేమి అని నిలిచి వాదము చేసే నేర్పుతోడ  బ్రహ్మ క్షత్రియులకు సహపంక్తి నేరమా చరిత్ర  లన్ని గాంచి చెప్పుడయ్యా అంటూ మిధున చక్రవర్తితో బ్రాహ్మణ వశిష్ట బ్రాహ్మణుడు భోజనం చేయలేదా  కుంతి భోజుని ఇంట  దూర్వాస మహాముని  కుంతి చేసిన వంటలు రుచి చూడలేదా? అడవిలో ద్రౌపది అతిధి బ్రాహ్మణులకు సిద్ధాన్న మిడి తృప్తి చేయలేదా  వాళ్లకు లేని వివక్ష నాకు దేనికి అని ధైర్యంగా  ప్రశ్నించిన  ధైర్యశాలి  అప్పటికే తనకు తెలిసిన విద్యా వినయ సంపత్తి శ్లోకాన్ని కూడా వారికి  చెప్పి తన పండిత ప్రకర్ష ఏమిటో తెలియజేసిన జ్ఞాని అయినా ఏం మాట్లాడను లెక్కించక వారిని దూరం చేశారు అధ్యాపకులు.
దేశమంతా తిరిగి చూడవలసిన ప్రదేశములన్ని చూసి  చివరకు  కృష్ణ దేవి పేట వచ్చి దప్పిక తీర్చుకోవడానికి నీరు అడిగితే చిటికెల భాస్కరుడు అన్న  అపరిచిత వ్యక్తి పిలిచి ఆతిథ్యం ఇచ్చి  నేను తపస్సు చేసుకోవడానికి సరైన స్థలం చూపించమంటే దగ్గరలో అన్ని వసతులు వనరులు ఉన్న పర్ణశాలను చూయించితే అక్కడ తపస్సమాధికి సిద్ధమైనాడు సీతారామరాజు  గారు. మంత్ర శాస్త్రముల మర్మములను  జ్యోతిష్యవిద్యను, వాస్తు శాస్త్రాల హస్తరేఖల వస్తు గుణములు అన్నీ  పెరటి మూలికల పేరు పేరునా తలిచి గురువైద్య పద్ధతుల గుట్టు తెలిసి  భూతపిశాచాల బాధలను తీర్చే రక్ష రేకుల  సేకరించి వ్యాధి పీడితులకు మందులు ఇచ్చి  వారి బాధలను తొలగించడానికి సిద్ధమైన వాడు మన్య ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.

కామెంట్‌లు