జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 హనుమంతుడు కిష్కిందకు చేరుకుని రామునికి వివరించి చెప్పినది ఈ జానకి దివ్యదర్శన  వర్ణన అయ్యే జానకని గురించి వాడిన మొదటి మాట ద్రష్ట అని చెబుతాడు రామునితో జానకి పరిపూర్ణ దృష్టికి ప్రతీక హనుమంతుడు ఈ దివ్య దృష్టి అనుగ్రహం తోనే ఆ వాణినే తన వాణిగా ప్రాతినిధ్యం  వహిస్తాడు సుందరకాండలో ఈ రెండు ముఖ్యపాత్రలు మిగతా వారందరూ సందర్భాన్ని ప్రభావితం చేయడానికి కల్పించబడిన వారే జానకి ఔన్నత్యాన్ని ప్రకాశవంతం చేయడానికి రావణుడు అనుచర దానవులు ఉపయోగించబడ్డారు ఏ వస్తువు సౌందర్య విషయం కూడా ఆయా సందర్భాలు బట్టి ఉంటుంది వాస్తవంగా రావణుని దానవరాజ్యంలోని అత్యంత సంక్లిష్ట పరిస్థితులలోనే సీతమ్మ హనుమంతుల విశిష్ట సౌందర్య ప్రభావం మనకు  ప్రతిభావంతంగా కనిపిస్తుంది.
జానకిలో పరమో కృష్ట గుణం పరనింద విముఖత్వమే ఎటువంటి దుర్మార్గుడైనను వారి పట్ల శత్రుత్వం ఉండదు. ద్వేషం అసలే ఉండదు రాముని క్షేమం ఆశించి లక్ష్మణునితో పనికిన కఠిన పదజాలాన్ని తలుచుకుని పదేపదే పాచ్యతాప పడేది. తన దుఖిత స్థితికి కారణం  దౌర్భాగ్యమే కానీ వీరెవరు కాదని తలచేది. ఇతరుల తప్పులను మన్నించడంలో జానకి ముందుండేది. హనుమంతుని అమూల్య సేవలకు గుర్తింపుగా అతనికి ఏదైనా కానుకగా ఇవ్వాలన్నా కూడా తన నిస్సహాయతను విడిపించేదే కానీ ఇతరులను ఎవరిని నిందించలేదు సీతమ్మ  ఆమె గొప్ప చారించే తలపెట్టిన దానవులను మటుకు తనకు సీతమ్మ తన వాళ్ళనే ఇంత దారుణం జరుగుతున్నది దానికి వారు బాధ్యుడని ఆడుకోవడం దేనికి అని తన మహా ఔదార్యాన్ని ప్రదర్శించింది ఆ మహాతల్లి  ఇలా ఉదారులమైనప్పుడే నేను త్వరలో స్వామిని చేరుకోవాలి అనే కోరికను తెలియజేసింది.
కామెంట్‌లు