ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమండలం మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోసే   ఆదిశేషుని పేరుతో వెలసిన కొండ ఆ గిరిని చూడగానే  తనకు తెలియని ఆనందంతో  ఆనంద మదియేమో గగనమంత నిండి కుండలిని నాట్య మాడ వేయి పడగల శేషాద్రి ఆదిశేషుని అవతారం  వెలుగులు నింపుతూ కనిపిస్తోంది. కార్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంటాడు. శేషాద్రి నుంచి నారాయణ అద్రికి ప్రయాణం అయ్యాడు అక్కడే నాకు కనిపిస్తాడేమో అన్న ఆశతో  ఆనందపు వెలువలో నిన్ను చూడక పోతే 
బుద్ధి నిలిపి నిశ్చల రీతిన్ కనుగొంటిని నారాయణ నిను చూచితి మేను మరచి నిలచితి   మ్రోలన్. ఆ నారాయణుని చూడగానే మనసు ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై  నా మనసు నిన్ను ఏ రీతిగా నిలవడం వల్ల నిన్ను కనుక్కునే అదృష్టం కలిగింది అంటూ  శరీరాన్ని మర్చిపోయి  చూస్తూ ఉన్నాడు. ఆ స్వామిని చూడగానే అతనిలో భక్తి పరవశం ఉబ్బితబ్బిపై  అనుకోకుండానే  పద్య రూపంలో చెబుతున్నాడు అన్ని చోట్ల నీవె ఆకాశమన నీవె నాదు హృదయమందు నాధ నీవె వెంకటాద్రి యందు వెలసిన నా స్వామి నీవే నేను కాదే నీరజాక్ష ఆర్తితో నిన్ను కొలిచిన వాడికి  దర్శనం ఇవ్వకుండా ఉంటావా  నీవు నేను ఒకటి కాదా  అది తెలుసుకోవడానికి ఇంత ప్రయత్నం కావాలా  వెంకటాద్రినాథ  పవిత్రతకు మారుపేరైన నిన్ను  హృదయము నిండా భక్తితో కొలిచి నప్పుడు మనసు నిండా నిన్నే నమ్ముకుని  నింపుకొని  నీ పైనే దృష్టి మరల్చిన మాకు  మోక్షాన్ని ప్రసాదించకుండా ఉంటావా  అంటూ ఎంతో భక్తితో  పారవశ్యంతో  ప్రార్థన చేస్తున్న అన్వేషకుని  మానసిక వ్యధను ఎంతో అద్భుతంగా పద్య రూపంలో మనకు అందించారు నాన్నగారు డాక్టర్ కాకర్లపూడి వెంకటరాజు గారు  వారి భక్తిని కొలిచే యంత్రమే లేదు  వారి జీవితం ధన్యం. నాన్నగారు డాక్టర్ కె వెంకట్ రాజు గారికి  అల్లూరి సీతారామరాజు అంటే ప్రాణం  వారి పేరు వింటే చాలు  వారికి వీరావేశం వచ్చేస్తోంది  ఆంధ్ర దేశానికి నాయకుడు అల్లూరి సీతారామరాజు అని నమ్మిన వ్యక్తి  వారి స్వగ్రామం వెళ్లి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకుని  ఆ తర్వాత మా బంధువులంతా   మరణించారు అన్న వార్త విన్న  ఆ గ్రామ ప్రజలు వారి గ్రామంలో  వారి కోసం ఏర్పాటుచేసిన  ప్రదేశాన్ని పరిశీలనగా చూసి వచ్చాం  అప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర   అభినయానికి  సరిపడిన రచన చేయడం దానిని నేను ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయడం దానిని విని ఉషశ్రీ గారి అమ్మాయి  డాక్టర్ గాయత్రి తన బృందంతో ఏకపాత్రను వేడుకపై ప్రదర్శించడం ఆ తర్వాత మా సోదరుడు రమణ రాజు కూడా  ఆ పాత్రను ప్రదర్శించాడు.

కామెంట్‌లు