ఆత్మీయ సోదరులందరినీ ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాను మీకు తెలిసిన మన సత్తా చూపి మన మాతృభూమిని స్వతంత్రంగా నిలబెట్టడం కోసం పరాయి పరిపాలనలో మనం పడరాని ఎన్నో బాధలు పడ్డాం మన సహనాన్ని వారు అలుసుగా తీసుకున్నారు ముద్దమద్దకి నెత్తి మీద మొట్టుతూ ఎన్నో హింసలకు గురి చేశారు ఇప్పుడు మన శక్తిని వారికి చూపినట్లయితే వారందరూ తప్పకుండా మారిపోతారు మన మన్య ప్రాంతంతో బుద్ధిగా మసలుకుంటారు మన్య భూముల దోపిడీ మాన్పడం కోసం చావో రేవో తెల్చుకుంటూ సమరం చేయవలసిన బాధ్యత మన భుజస్తంభాల మీద ఉన్నది కష్టనష్టాలు ఎన్నో ఎదురవుతాయి వాటి రెండిటినీ భరించి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించ వలసిన బాధ్యత మనపై ఉన్నది. వీరుడు ఎప్పుడు వీరమరణం కోరుకుంటాడు దానికి సిద్ధపడిన వారందరూ ఈ ఉద్యమంలో చేరవచ్చు మంచి చెడ్డలను తర్కించి మనం ముందుకు వెళ్లాలి వీరులు ఎవరైనా సరే ఈ వీర భూమిని చేరడానికి అందరిని స్వాగతిస్తున్నాను మీరందరూ కూడా దేహప్రాణాలు ఇచ్చేటువంటి ధీరులు అని నాకు తెలుసు దేవి ముందర మనమంతా బాస చేద్దాం మీరు చేరాలని అనుకుంటే చేతిలో చేయి వేసి చెప్పండి ప్రతిన చేయండి ప్రాణత్యా గానికి సిద్ధం కండి మనలో మెరికలవంటి వీరులు విరోధి వర్గాన్ని వధించగల సామర్థ్యం కలవారు చేతిలో విల్లు పట్టుకున్నట్లయితే ఏనుగు లాగా యుద్ధం చేస్తున్న వారిని కూడా మట్టికరిపించ గలిగిన చావ కలిగిన వారు మన మన్యవీరులు. యుద్ధాల్లో మడమ తిప్పని యోధులు మీరందరూ నీతి నియమాలకు నిలబడి పనిచేసే ప్రతి ఒక్కరికి సాయుధ శిక్షణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను వీళ్లు నా చేతిలో పట్టుకొని వైరి దళాలను చీల్చి చెండాడగలిగిన చెంచు దళం మనది కొండ బండలలో దాగి యుద్ధం మనం చేస్తూ ఉంటే మన కోయ దళం క్రూర మృగం లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది వడిశలు బట్టి దానిలో రాళ్లను పెట్టి వాటిని సూటిగా కొట్ట గలిగిన మన్యపు యువతుల మాటుదళం మనది పరిచారికులవలే ప్రవర్తిస్తూ దారులను మళ్లించి శత్రువులను చీకాకు చేసేటువంటి నాయకులు ఉన్నారు వేగు వార్తలను అందించు వేగు దళం కూడా మనకున్నది మిరప డోళ్ళల ఉత్తరాలు మాటు పెట్టి వైరి సేనలకు అందించు దళం తీరు తీరునా దళముల తీర్చి దిద్ది స్వీయ రక్షణ కోసం పాటుపడే దళం మనది.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి