ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- -ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రాజు సూర్య కలిసి ధ్యానం చేసేవారు పూజలు చేసేవారు పగలు రేయి దాట్ల కృష్ణ వర్మ  వారికి మంచి స్నేహితుడు అయ్యాడు  దానితో రాజుగారు అందరికీ నాయకుల్లాగా వ్యవహరించాడు  ఎన్ని రోజులు ఇలా కష్టపడితే దేశమంతా తిరగాలి  అన్న అభిప్రాయంతో తల్లితో చెప్పకుండా తాను  ముందుగా  జయపురాన్ని చూసి పల్నాడు సీమ వనములను దాటి అజంతా గుహల అందాలు తిలకించి భరత చిత్రకళ వైభవం చూసి బుద్ధ దేవుని బోధన బుద్ధి తలచి మంచి చెడ్డల  తగ్గించి మనసులో దుష్ట శిక్షణకు ఇది చాలా దూరమనుచు నేడు భగవద్గీత నాకు ఆదర్శం అని చెప్పాడు రాజు.గోదావరి పుట్టిన కొండ శిఖరం నాసికాత్రయాంబకానికి  వెళ్లి చూసి పంచవటిని చేరి శ్రీరామ పాదములు తాకి  శిలపైన తలన పెట్టి కన్నుల  భాష్పములు గ్రమ్ముచుండ మొక్కి సీతమ్మ చెరపడ్డ చోటు చూసి చుప్పనాతి సూర్పనఖ  ముక్కు చెవులు కోసేలా స్థలాన్ని  సౌమిత్రి ఆశ్రమ స్థలాన్ని చూసి మాయ మృగం మహిళ రాయి చూసి ఇచ్చటనే జటాయువు జీవములు బాసే నంటూ కన్నీరు పెట్టుకుని వలచాడు  రామ కథలన్నిటిని ఆయన మనసులో నిలుపుకున్నాడు  మొదట  మధ్య దేశంలో ఉన్న అరణ్యాలను దాటి ఉజ్జయినికి వెళ్లి మహాకాళి ఉపాసన చేసి మహాకాళేశ్వరుని మనసులో కొలిచి ఓంకార క్షేత్రాన అమలేశ్వరుని చూసి నర్మదా తీరాన స్నానం చేసి  తరువాత పంజాబ్ చేరి  కార్యశీలి లాలా లజపతి మొదలైన యుద్ధ వీరులను కలసి మంతన మురారి ధర్మక్షేత్రం కురుక్షేత్రము చేరి  ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు భగవద్గీత పరమార్థాన్ని బోధించాడు  అని తలచాడు. ఇక్కడే కదా భీష్మాచార్యుల వారు శయ్యను చేరింది  పాండవులకు భరత నీతిని చెప్పింది ఇక్కడే కదా  ఇక్కడే అధర్మంపై ధర్మం అఖండ విజయాన్ని పొందింది  ధర్మ నిర్ణయ తులాభారం పేరిట ఈ సమయంలో తప్పని వేదిక  ఈ తరం నేను చూసిన తర్వాత నా జన్మ ధన్యమైనది  అని ఆత్మలోనే ఎంతో సంతోషించాడు రాజుగారు  ఆ తర్వాత ప్రయాగలో స్నానం చేసి  వారణాసి పట్టణానికి వెళ్ళాడు  వారణాసిలో మరణించేటువంటి జీవులు కుడి చెవి పైనుంచి  పండుకుంటే  తారకమంత్రాన్ని శివుడు  గురువుగా మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు  దివ్య దృష్టి కలిగిన తపస్సులు ఎందరో  ఈ వారణాసి కాశీలో  మరణము చెందితే చాలు ఆ శంకరుడు మనకు కైలాసాన్ని ఇస్తాడు అని భావించి చరించి తరించిన వారే.




కామెంట్‌లు