ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నీలకంఠేశ్వరుని ఆలయాన్ని తన సొంత ఇంటిలా తలచి  కన్నవారిని అక్కడే కాపురం ఉంచి అక్కడే ఉంటూ అడిగిన వారికి హస్త సాముద్రికాలు  చెప్పడం  వాస్తు ని చెప్పి మంచి చెడ్డల  విషయాలను వివరించడం జాతక గ్రహగతుల చెప్పేటప్పుడు భూతప్రేత పిశాచాల బాధలు  గోలలకు రక్ష రేకులను కట్టి శుభములు చెప్పటం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ప్రత్యేకించి చెప్పుకోవలసినదేమిటంటే ఆయన చెప్పిన ఏ ఒక్క మాట పొల్లు పోకుండా  భగవంతుని దయవల్ల ప్రతిదీ జరుగుతూనే ఉంది  దానితో వచ్చిన ప్రజలు అతనిని దేవుడు అంటూ  ఆ అడవిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేస్తూ  రాజుగారికి ఎన్నో కానుకలను సమర్పిస్తూ ఉండేవారు. ఎవరి వద్ద నేర్చుకున్నాడో ఎలా నేర్చుకున్నాడో మంత్ర శాస్త్రంలో ఉన్న మర్మాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు జ్యోతిష విద్యలో వాస్తు శాస్త్రాల్లో హస్తరేఖల వస్తు గుణాలను పెరటి మూలికల పేరున తలచి గృహవైద్య పద్ధతుల్లో కూడా వాటి గుట్టు తెలిసి భూత పిశాచాల బాధలు పోగోడుతున్న రాజు గారి చర్యలకు అప్పుడప్పుడు  భూత పిశాచాల భూతాన్ని పోగొట్టడం దానికి రక్ష రేకులను ఇవ్వడం ఏదైనా వ్యాధితో వచ్చిన వారి బాధలను పోగొట్టడం  తాను చెప్పిన జోష్యాలన్నీ జరుగుతూ ఉండడంతో  అడవి జనులకు ఆయన దేవుడు లాగా కనిపించాడు  భగవంతుని స్వరూపంగానే ఆ అడవి ప్రజలు అందరూ పొగుడుతూ ఉంటారు సీతారామరాజును
సెబాస్టియన్ తెల్ల పందికొక్కు తహసిల్దార్ వేషంతో వచ్చి  తానే సర్కారులు అంటూ  మన్యవాసుల సొమ్మును అన్యాయంగా  మెక్కుతూ  ఉన్నాడు  ఎవరైనా ఎదురు తిరిగితే వారిని జైల్లో వేస్తూ ఉంటాడు  24 కాంట్రాక్టులు ఇవ్వాల్సి వస్తే తానే  ఆ పనిని చేయించి వారికి  ఎవరికి కూలి ఇవ్వకుండా ఎంతో బాధ పెడుతూ ఉండేవాడు  వారు కన్నీళ్ళతో వేడుకున్నా వారి మొరను వినేవాడు కాదు  బాస్టియల్  దొర  డబ్బులు ఇవ్వడం లేదని ఎవరైనా కూలికి రాకపోతే వారిని కోరడాలతో కొట్టి వారితో అనవసరమైన కేసులు పెట్టి కోర్టుకు ఈడ్చే కిరాతక మనస్తత్వం అతనిది  దానితో అక్కడ ప్రజలకు తినడానికి ఏమీ లేక  శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉండేవాడు  ఇలా బాధలు పడుతున్న కోయ దొరల దుఃఖాన్ని ఆర్తిని  విన్నాడు రామరాజు.


కామెంట్‌లు