కైకేయి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 తక్షణమే శ్రీరాముడు కైకేయి ముందు ప్రత్యక్షమైనాడు కైకేయి ముఖంలో ప్రకాశం లేదు అశాంతితో ఉన్నట్లు కనిపిస్తోంది  తండ్రి దశరథుడు అసాధారణ దుఃఖ సముద్రంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నాడు ఇటువంటి ఉద్విఘ్న వాతావరణంలో శ్రీరాముడు కూడా వికల మనస్కుడై అడుగుతున్నాడు ఏమైంది తండ్రి దశరథుని మనసు ఎవరో అనరాని మాటలతో గాయపరిచి ఉంటారు కానీ మరెవరైనా కానీ ఎందుకు కారణమై ఉండవచ్చును కైకేయి విషయం కొద్దిగా శ్రీరాముడికి తెలుసు రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ అవకాశం తీసుకొని కైకేయి  రాజు ఏదో చెప్పదలుచుకున్నాడని  చెప్పింది  కానీ భయం ఆవహించింది అయినప్పటికీ కైకేయి శ్రీరామునితో నీవు నీ తండ్రి కోరికను నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన కోరిక ఏమిటో నీకు నేను చెప్తాను అన్నది. కైకేయి మాటలు శ్రీరామునికి బాధ కలిగించాయి కానీ పరిస్థితి ఏమిటో వాస్తవం తెలుసుకుంటే మనశ్శాంతి లభిస్తుందని తలచి శ్రీరాముడు తల్లి నా తండ్రి ఆజ్ఞాపించినా ఆజ్ఞాపించకపోయినా సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను తప్పక వనవాసానికి వెళతాను. కానీ నా తండ్రి నాతో ఎందుకు మాట్లాడటం లేదో నాకు తెలుసుకోవాలని మాత్రం ఉంది. భరతుని  కూడా పిలిపించడం అవసరం కాదా కానీ కైకేయికి అంత ధైర్యం లేదు భరతుడు అయోధ్యకు చేరుకునే లోపే శ్రీరాముడు అరణ్యాలకు వెళ్లాలనేదే కైకేయి లక్ష్యం భరతుడే కనుక శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరే ముందే అయోధ్యకు చేరితే భర్తడే శ్రీరాముని వరవాసానికి పోనివ్వడేమో అనేదే కైకేయి శంక భయము కూడా అందుచేతనే అన్ని ఈ లోగానే ముగించాలి చివరకు శ్రీరాముడు కైకేయి మాటలు శిరసా వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ తల్లిదండ్రులకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడితో కైకేయికి కొంతమేరకు మనశ్శాంతి లభించింది అని చెప్పవచ్చు  కానీ శ్రీరాముడు అయోధ్యను వదిలి వనవాసానికి బయలుదేరి వరకు కైకేయికి  మనసు శాంతించదు రాముని ప్రజలు ఆటంకం కలిగిస్తారేమో  కౌసల్యా సుమిత్రలు ఇద్దరూ ఈ విషయాన్ని వ్యతిరేకిస్తాడు కదా దీన్ని జయించాలి ఎలాగైనా ఇలా అనేక ఆలోచనలు కైకేయిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దశరథుని ధైర్యాన్ని గురించి ఈ విషయంలో ఒకరికి అనుమానమే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో తెలియదు  ఏ భరతుని గురించి దుష్ట కార్యక్రమాన్ని నడిపిస్తున్నదో ఆ భరతుడే చివరకు ఎదురు తిరిగితే కథ ఎక్కడికి వస్తుంది దుష్టురాలైన మందర ఈ ప్రతికూల పరిస్థితుల  తీవ్రతని ముందే అంచన వేసి కైకేయి మనసును శిలలా మార్చేసింది  నిర్భీతికతతో  సర్వ విఘ్నాలను ఎదుర్కొనే ధైర్యం నూరిపోసింది అన్నిటికీ సిద్ధం అయింది కైకేయి.
కామెంట్‌లు