ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322
 తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు వారిని తప్పకుండా సేవించి తీరాలి  ఎవరైనా శత్రువులు శరణు అంటే వారిని మనం చంపకూడదు  దయతో వారిని కాపాడాలి తప్ప శిక్షించకూడదు  స్త్రీ బాల వృద్ధులకు మనం చేటు చేయకుండా జీవితాన్ని కొనసాగించాలి  చిన్న గాయం కూడా వారికి తగలకూడదు  కలలో కూడా మన వారిని చంపవలసిన అవసరం రాకూడదు  ఎదిరించే వైరులను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ విడవరాదు  ఇది భరత జాతి నీతి  నీతి తప్పిన వారు ఎంత నేతలైనా  దండనకు అర్హులే. ఇది మన దళపు నీతి  మాలధనులైన మన్యపు వీరులందరి  జీవిత ఆశయం ఇదే కావాలి  దానికోసం మన జీవితం నాశనం అయినా విచారించకూడదు బాధపడకూడదు. యుద్ధ రంగంలో అసహాయ సూరుడు అగ్గిరాజు  వాళ్లున్న పోరాడజాలిన వీలుకండ్రు మన వీరయ్య  పదాలు వీర వరుడు  ఇలా మూడు సంవత్సరాలు  శిక్షణతో ముగిసిపోయింది  సమరభేరిని మోగించే సమయం ఆసన్నమైంది అంటూ ఆలోచించి  సేనను అయ్యత్త పరచి ఆ వనంలో విప్లవాగ్గునులు పుట్టినట్టుగా  ఉన్నది పరిస్థితి  వీరఘట్టం దొర సమరయ్య పేర్లు మరొక సమయం వచ్చింది  మనమంతా సన్నత్వం కావాలి సోదరా మల్లు నీ చావ శక్తిని చూపడానికి కాలం దగ్గర పడింది  గోకిరి ఎర్రేసూ  నీ విల్లు నీ చేతిలోకి తీసుకో పదును పెట్టు  నీ బాణ తతికి  పడాలు  లేవయ్యా శత్రువులను కూల్చడానికి  సాగిపోవడానికి సిద్ధంగా  అక్కలందరూ విడివిడిగా అడవి మొత్తం తిరిగి  వార్తలను చేరవేసే వృత్తిలో ముందుకు వెళుతున్నారు  మిరప డోల్లాల ఉత్తరాలను మాటుబెట్టి ఒడిసల బెట్టి వారికి  అందిస్తూ ఉంటారు మన సోదరీమణులు
చింతపల్లి పోలీస్ స్టేషన్కు వార్తను పంపండి  రామరాజు రేపు వస్తున్నాడు  సూర్యుడు అస్తమించే సమయానికి  అక్కడ ఉంటాడు  ధైర్యం ఉంటే నిలవండి అని చీటీ వ్రాయండి  ఆ చీటీ చూసిన  అధికారులందరిలో  మనసులలో  అనుమానం పెచ్చు పెరిగిపోయింది  అనిత రసాధ్యమైన  మనకు ఆజ్ఞలు ఇవ్వడానికి వాడు ఎంతటి వాడు  రానివ్వండి   వాడి దేహాన్ని యమునకు  కానుకగా ఇచ్చి పంపిద్దాం  మన్య వీరుల కోసం అంటే మంటలు అంటే అరుణ కాంతులు ఉదయాన్నే ఆవరించినట్లు  బానిసత్వపు చీకటులను పారద్రోలడానికి సూర్యుడు ఉదయించినట్లుగా  స్వాతంత్ర్య స్ఫూర్తి వోలె వస్తున్నాడు రామరాజు  వస్తాడట వెళతాడట ఎంత దమ్ము ఉన్నది అతనికి  రావడమే కానీ పోవడం అనేది జరగదు  అని పకపకా నవ్వుకుంటూ ఆ అధములందరూ మొద్దు నిద్ర పోయారు మధువు గ్రోలి.



కామెంట్‌లు