అష్టాక్షరీ గీతి:- బాల రాముడు- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల ,-సంచార వాణి:- 99127 67098

    శ్రీకర! నరశార్దూల!
    జయ కరుణాలవాల!
    జయ జగదభిరామ!
    అయోధ్యరామ! శ్రీరామ!
             🪷(2)
      కౌసల్యా దశరధుల 
      ముద్దుల కుమారుడవు 
      బాలరాముడవు నీవె!
      అయోధ్యరామ! శ్రీరామ!        
             🪷(3)
    తామర రేకుల వంటి
    కన్నులు కలవాడవు!
    కమల లోచన! రామ!
    అయోధ్యరామ! శ్రీరామ!
               🪷(4)
     మృగరాజు సింహం వలె
     పరాక్రమ వంతుడవు!
     సింహ పరాక్రమ! రామ!
     అయోధ్యరామ! శ్రీరామ!
🕉️శ్రీరామ! జయ శ్రీరామ! జయ జయ శ్రీరామ!
       [ శ్రీరామ షోడశాక్షరీ (16) నామ మాలిక ]
కామెంట్‌లు