లలిత గీతం*;- : ప్రభాకర్ రావు గుండవరం( మిత్రాజీ))ఫోన్ నం.9949267638
మారాలి మారాలి
మనమే మారాలి
మనలోని విజ్ఞతే
మనను మార్చాలి !! మారాలి!!

ఎవ్వరిమనుకున్నా
మంచితనమే మిన్న
ఎవ్వరు ఎదిరించినా
ధైర్యమే మన అన్నా!! మారాలి!!

అహంకారం అసూయలు
చీడపురుగులు అవీ
మానవ కుటుంబాలనే
మంట కలుపునూ !! మారాలి!!

మనలోని మంచి గుణమే
అందరి దరి జేర్చు
నలుగురితో నవ్వుతూ
కలిసి ఉంటే చాలు !! మారాలి!!

ప్రేమతో ఉందాము
అనురాగం చూపుదాము
ఆత్మీయతతో పలకరిస్తూ
మనమంతా కలిసుందాం!! మారాలి!!
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

కామెంట్‌లు