స్వాతంత్య్రం ; - ఆవుల చక్రపాణి యాదవ్- 9963350973
వచ్చిరి వచ్చిరి
బ్రిటీషు వారు
భారతదేశం వచ్చిరి
బ్రిటీషు వారు

చేసిరి చేసిరి
వాణిజ్య వ్యాపారం
కొత్త వస్తువుల
పరిచయ వ్యాపారం

పెట్టిరి పెట్టిరి
రాజులకు వైరం
వారిని రాజుల జేసెను
మన రాజుల వైరం

పెంచిరి పెంచిరి
కొత్త పన్నులు
ఎదురు తిరిగితే
అణగద్రొక్కిరి

దోచిరి దోచిరి
సంపద దోచిరి
తరలించుటకే
రోడ్లు, రైళ్లూ వేసిరి

చేసిరి చేసిరి
స్వతంత్ర పోరు
ఎందరో వీరులు
మరణం వరకు

వచ్చెను వచ్చెను
గాంధీ వచ్చెను
అహింస,సత్యాగ్రహమని
పోరు పంథా మార్చెను

తెచ్చెను తెచ్చెను
స్వాతంత్ర్యం
చూపెను చూపెను
గాంధీ అహింసా మార్గం


కామెంట్‌లు