నిజానిజాలు- -గద్వాల సోమన్న,9966414580
కుక్క అరిచే అరుపులకు
కొండ బెదిరిపోతుందా!
వదరుబోతు మాటలకు
గుండె అదిరిపోతుందా!

అతుకుగతుకులొచ్చినా
నిండు కుండ తొణకుతుందా!
మబ్బులెన్ని కప్పినా
సూర్యోదయమాగుతుందా!

ఉవ్వెత్తున ఎగిసిపడే
అలలకు అంబుధి జడియునా!
బ్రతుకులో ఆటుపోట్లకు
ధైర్యశాలి కంపించునా!

చిన్నిచిన్ని సమస్యలకు
చింతిస్తే ఎలా మరి!
మనోవ్యాధి ముదిరితే
అవుతుంది మెడలోన ఉరి!


కామెంట్‌లు