మా ఊరి యేరు;- -గద్వాల సోమన్న,9966414580.
గలగల పారును యేరు
చూడుము దాని జోరు
అవరోధాలెనున్నా
అందించు త్రా(సా)గు నీరు

బండరాళ్లు ఎదురైన
చెత్తాచెదారం వేసిన
ముందుకు సాగును యేరు
అందరి క్షేమమది కోరు

అడ్డం ఏదైనా
వస్తే మరో మలుపు
తిరుగుతుందోయ్! యేరు
లేదు దానికి అలుపు

సవాళ్ళను ఎదుర్కొని
స్ఫూర్తి నిచ్చును యేరు
గమ్యం చేరు వరకు
విశ్రమించదు యేరు


కామెంట్‌లు