"అ" అక్షర పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
అభిమానమున్నచో
అనురాగమే విరియును
అరమరికలు లేనిచో
అమితానందముండును

అపనిందలు మానినచో
అనుమానం తరిమినచో
అంతరించు భేదాలు
అంకురించు ఆప్యాయతలు

అందించిన చేయూత
అవసరతలో  బహు మేలు
అన్ని వేళల్లో విజ్ఞత
చూపిస్తే చాలు చాలు

అనవసరమైన వాటికి
అంతనంత  ఉండాలి
అభివృద్ధి పథంలోన
అలయక ముందుకెళ్లాలి


కామెంట్‌లు