అక్షర సందేశం;- -గద్వాల సోమన్న,9966414580
అనురాగము కానుక
అభిమానము వేడుక
అనుదిన జీవితంలో
ఆత్మీయత ఘనమిక

అమ్మ ఇంట దీపిక
అమూల్యమైన హారిక
అనంత విశ్వంలో
ఆమె కదా తారక

పెద్ద వారి దీవెన
ఎదుగుదలకు నిచ్చెన
విజయాలకు మూలము
నిరంతర సాధన

అమితమైన వేదన
అనవసరపు వాదన
తెచ్చిపెట్టు ఖేదము
లేదు అందు మోదము


కామెంట్‌లు