హితోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
అసత్యాలు నమ్మొద్దు
అశ్రద్ధ చేయొద్దు
అమర్యాదగా మాత్రం
అందరితో ఉండొద్దు

అప్రతిష్ట తేవద్దు
ఆవేశం చూపొద్దు
అసంఘటిత శక్తులకు
అవకాశమివ్వద్దు

అత్యాశ కోరద్దు
అసంతృప్తి పొందద్దు
అక్కరలో ఉన్న వారికి
మొండి చేయి చూపొద్దు

అమ్మ భాష మరవద్దు
అవహేళన చేయొద్దు
తెలుగోడుగా గర్వించు
ఆదర్శమై జీవించు


కామెంట్‌లు