మాటల ముత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఉపయోగం యేరు
అవసరమే నీరు
మనిషి మేలు కోరు
తెచ్చుకొనుము పేరు

కల్గియుండు దమ్ము
ఖరీదైన సొమ్ము
నీచగుణం దుమ్ము
చేయునదే వమ్ము

విలువైనది చెలిమి
జీవితాన కలిమి
చేకూర్చును బలిమి
శ్రేష్టమైన పసిమి

మార్చుకొనుము తీరు
అదుపు చేయి నోరు
మంచిదగును ఊరు
సాటి ఎవరు లేరు


కామెంట్‌లు