గణతంత్ర దినోత్సవం;- -గద్వాల సోమన్న,9966414580
గణతంత్రం వచ్చింది
సంబరమే తెచ్చింది
ఎద ఎదలో దేశభక్తి
అంబరమే తాకింది

మువ్వన్నెల మన జెండా
ముచ్చటగా ఎగిరింది
భారతీయుల మది నిండా
ఆనందం నిండింది

సమర యోధుల ప్రతాపం
ఘన జాతీయ పతాకం
చాటుతుంది జగతిలో
గర్వంగా గగనంలో

భారతీయ వీరుడా!
భారతమ్మ పుత్రుడా!
గణతంత్ర పర్వదినం
అందరికీ శుభ దినం


కామెంట్‌లు