వెన్నెలమ్మ పదాలు;- -గద్వాల సోమన్న,9966414580
కారుచిచ్చే కలత
శరీరమందు నలత
వదిలిపెట్టుము తొలుత
ఓ వెన్నెలమ్మ!

మనసు మార్చును ధనం
మార్పునొందును గుణం
దాని వెంటే జనం
ఓ వెన్నెలమ్మ!

ఊబి వంటిది అప్పు
కుటుంబాలకు ముప్పు
తెలిసిచేయుట తప్పు
ఓ వెన్నెలమ్మ!

కష్టపడితే ఫలం
భవిష్యత్తుకు బలం
చూడ దావానలం
ఓ వెన్నెలమ్మ!


కామెంట్‌లు