వెన్నెలమ్మ ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
హానికరమే కుళ్లు
చేయు హూనం ఒళ్ళు
విడిచి దానిని మళ్లు
ఓ వెన్నెలమ్మ!

చెలిమి విలువను ఎరుగు
భక్తిభావం పెరుగు
జీబితాలకు వెలుగు
ఓ వెన్నెలమ్మ!

కలసివుంటే గెలుపు
మనసు మనసును కలుపు
తిరుగు బ్రతుకులు మలుపు
ఓ వెన్నెలమ్మ!

తప్పకూడదు మాట
మాట చల్లని తోట
తోటలోనికి బాట
ఓ వెన్నెలమ్మ!


కామెంట్‌లు