గాంధీజీ విద్యాభ్యాసం;- -గద్వాల సోమన్న,9966414580
"పోర్ బందర్, రాజ్ కోట్,
ఇంగ్లండ్"లలో చదివారు
పవిత్ర మత గ్రంథాలను
పారాయణం చేశారు

చదువులోన గాంధీజీ
చూడగ సగటు విద్యార్థి
ఘన సుగుణ సంపదలతో 
సంపాదించె బహు కీర్తి

సాంప్రదాయ పద్దతులలో
నిష్ఠగా  పెరిగినారు
అబద్ధాలకు ఆమడ
దూరంగా ఉండినారు

న్యాయ శాస్త్రమునభ్యసించి
పట్టభద్రుడైనారు
న్యాయవాది వృత్తిలోన
కొంతకాలం ఉన్నారు

చదువూ,వ్యక్తిత్వమూ,
ఆలోచన సరళీలో
మెళుకువలు గైకున్నారు
అగ్రస్థానం చేరారు

చదువు అన్నిటికి మూలం
ఎదుగుటకిలలో మార్గం
సంస్కారమునొందెందుకు
అదే చక్కని సాధనం


కామెంట్‌లు