ప్రబోధం(తిశ్ర గతిలో..);- -గద్వాల సోమన్న,9966414580
జోలపాట వినుము
పాల బువ్వ తినుము
పువ్వు లాగ నువ్వు
నవ్వు సొగసు రువ్వు

మాట విలువ ఎరుగు
తోటలోన తిరుగు
పాటలిచ్చు హాయి
ఆట మంచిదోయి

పల్లెసీమ మనకు
తల్లి అదే తుదకు
కల్లలన్ని వీడు
మల్లె వోలె ఉండు

నాన్న త్రోవలోన
అన్న చెలిమిలోన
ఉన్నవోయ్! వెలుగులు
మిన్నవోయ్! మమతలు


కామెంట్‌లు