చిన్న పిల్లలు (వెన్నెలమ్మ పదాలు)- -గద్వాల సోమన్న,9966414580
చిన్న పిల్లలు ఇంట
సకల శుభముల పంట
దేవుడుండును వెంట
ఓ వెన్నెలమ్మ!

మనసు చూడగ మృదువు
స్వచ్ఛ ప్రేమల నెలవు
మేలి గుణములు కలవు
ఓ వెన్నెలమ్మ!

లోకమెరుగని వారు
దగాకోరులు కారు
సాటి వారికి లేరు
ఓ వెన్నెలమ్మ!

చిన్న పిల్లల మాట
జీవ జలముల ఊట
పరిమళించే తోట
ఓ వెన్నెలమ్మ!


కామెంట్‌లు