అక్షర ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
అవహేళన చేయరాదు
అపనిందలు వేయరాదు
అమితమైన ఒత్తిడిని
అసలు మనము మోయరాదు

అపకీర్తికి లోనుకాకు
అబద్ధం ఆడబోకు
ఆశ్రయించిన వారికి
అన్యాయం చేయబోకు

అహింసను వీడ రాదు
అకృత్యాలు పూనరాదు
అయిన వారిని మాత్రం
అలుసుగా తీసుకోరాదు

అపనమ్మకముండరాదు
అత్యాశ ఏలరా

దు
అనుచరులకు ద్రోహమే
కలనైన తలపెట్టరాదు

కామెంట్‌లు