ఋజుమార్గంలో పయనించు
ఋతువుల వేళలు గమనించు
సక్రమంగా నడుచుటకు
నిజానికి ఋజువై జీవించు
ఋణగ్రస్తుడవే కావొద్దు
ఋషి బోధలనెపుడు మరవద్దు
సోమరితనమునాశ్రయించి
స్వయం కృషికి దూరమౌవొద్దు
వేదాలనే శోధిద్దాం
ఋగ్వేదమే చదివేద్దాం
ఋక్కులు అర్ధం తెలుసుకుని
వేదవ్యాసులమవ్వేదాం
ఋతురాగాలు చూసేద్దాం
ఋషి కొండను చూసొద్దాం
ఋ అక్షరంతో మొదలయ్యే
పదాలెన్నో వ్రాసేద్దాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి