అద్దమే గురువెగా....;- -గద్వాల సోమన్న,9966414580
అద్దమే అవనిలోన
అసలు గురువు నిజముగా!
తనువులోని లోపాలు
చూపి సరిచేయునుగా!

అద్దం లేని సదనమే
వసుధలోన ఉండునా!
ఆడవాళ్లు కోసమే
అవసరమే సరేనా!

మనస్సాక్షి చూడంగా
మేలి గురువు జీవితాన
రెండు కూడా సక్రమంగా
నడిపించు మిత్రులు ఇహమున

అద్దంలో చూసుకో!
అనవసరమైనవి కాస్త
ఇకనైనా సవరించుకో!
జీవితాన్ని దిద్దుకో!!

బాహ్య సౌందర్యం కన్న
అంతరంగ అందం మిన్న
ఈ సత్యం తెలుసుకో!
అనుభవంతో సాగిపో!


కామెంట్‌లు