అక్షరాలు;- -గద్వాల సోమన్న,9966414580
అక్షరాల కాంతిలోన
అజ్ఞానం అంతరించు
అనునిత్యమూ తోడుండి
అమ్మ వోలె అలరించు

అక్షరాల వనంలోన
అనుభవించు ఆనందం
ఆనుకొంటే వాటిపై
పోవునోయ్! అంధకారం 

అక్షరాలు కాగడాలు
వెలిగించును జీవితాలు
అవరోధాలెదుర్కొన
పదునైన ఆయుధాలు

అక్షరాల్ని ఆశ్రయించిన
అనిశమ్ము ఆదుకొనును
అసమాన ప్రతిభ కల్గి
అవనిలో బ్రతక వచ్చును


కామెంట్‌లు