అధరాల దరహాసం;- -గద్వాల సోమన్న,9966414580
అధరాలపై చిరునవ్వు
అందాలే రువ్వు రువ్వు
ఆరోగ్యం ప్రసాదించు
అద్భుతమైన ఔషదం

అరనవ్వు మనోహరం
అచ్చంగా మణిహారం
అనారోగ్యం తరిమే!
అపురూప ఆయుధమే!

అర విరిసిన లావణ్యం
అదృష్టమే దరహాసం
అఖండ శోభ గూర్చే
అజంతా శిల్ప సౌందర్యం

నయాపైసా కూడా
అక్కరలేదు ఏమాత్రం
అధరాల చిరునవ్వుకు
ఆరోగ్య ప్రదాతకు...


కామెంట్‌లు