అక్షర సత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఆదరించే మనసుంటే
అందరూ బంధువులే!!
అడుగడుగునా అగుపించు
అనురాగ సింధువులే!!

మనసు లేని మనుషులంతా
అక్షరాల రాబందులే!!
అట్టి వారిని స్నేహిస్తే
ఆఖరికి ఎండమావులే!!

అదుపు లేని మనసులతో
అనుదినము అపజయాలే
అస్థిరమైన తలపులతో
మనోసిద్ధి అసాధ్యమే!

అనుకున్న లక్ష్య సాధనకు
ఆధరువు సంకల్పమే
అజరామర త్యాగానికి
నిదర్శనం నిస్వార్ధమే


కామెంట్‌లు