ఓటమి విజయాల కూటమి;- -గద్వాల సోమన్న,9966414580.
జీవితాన ఓటమి
విజయాలకు కూటమి
ఏమాత్రం క్రుంగకు
ఆందోళన  చెందకు

అలల ఆరాటమే
వాటి పోరాటమే
ఒక్క సారి చూడుము
చింతించుట మానుము

అపజయాలు బ్రతుకున
విజయాలకు వంతెన
రాళ్లురప్పలు ఎదురైనా!
యేరు పరుగు అగునా!

ఓటమి లేని వారు
జగతిలో ఉందురా!
ఏదో ఒక చోట
దాని చవి చూడరా!


కామెంట్‌లు