ఊడలమర్రి;-గద్వాల సోమన్న,9966414580.
అదిగో అదిగో ఊడలమర్రి
ఎంతో పెద్దది ఊడలమర్రి
ఎటుచూసినా ఊడలు ఊడలు
నేలమ్మను ముద్దాడే ఊడలు

మర్రి చెట్టు  విరబోసుకున్న
మనోహరమైన శిరోజాలు
ఊగేందుకు అనుకూలించే
ఊయల్లాంటి  పిల్ల ఊడలు

పిల్లల మర్రి అని అంటారు
అందరు వచ్చి తిలకిస్తారు
నేత్రానందం పొందుతారు
అనుభూతులకు లోనౌతారు

ఔషధ గుణాలెన్నో ఉన్నది
వృక్షాల్లో మిక్కిలి పెద్దది
పశుపక్ష్యాదులకు నిలయం
సేదదీరుట చాలా మంచిది

చూడు చూడు ఊడలమర్రి
ఎంతో పెద్దది ఊడలమర్రి
ఎన్నెన్నో కలవు ఊడలు
పిల్లలకవే ఉయ్యాలలు


కామెంట్‌లు