అక్షరాల ఆవేదన;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ భాష తెలుగు వెలుగుకు
అమృతమ్ము వంటి పదాలకు
ఆదరణ తగ్గుతుందని 
అక్షరాల ఆవేదన

దేశభాషలందు లెస్సయిన
తెలుగుకు పూర్వ వైభవం
తిరిగి మనము తేవాలని
అక్షరాల అభిలాష

సంగీతానికి అనువైన
నుడికారాల్లో ఘనమైన
అమ్మ భాష వెలుగొందాలని
అక్షరాలు ఆశయం

అక్షరాల ఆవేదనను
అలక్ష్యం చేయకండి
అమ్మ భాష వైభవానికి
నడుంకట్టి ఇక కదలండి


కామెంట్‌లు