పూదోట;= -గద్వాల సోమన్న,9966414580
అందమైన పూదోట
గుబాళించు పూదోట
రకరకాల పూలతో
మనసు దోచు పూదోట

ప్రేమలొలుకు పూదోట
పలకరించు పూదోట
అందరిని స్వాగతించి
సేదదీర్చు పూదోట

భలే భలే పూదోట
త్యాగమూర్తి పూదోట
పూజలో ,సన్మానంలో
ముందుండే పూదోట

పూలతల్లి పూదోట
ఫలాలిచ్చు మేలి తోట
అనురాగమయి పూదోట
అపురూపం పూదోట


కామెంట్‌లు