జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా....
=====================================
ఆట వెలది పద్యాలు
1) బతికినన్నినాళ్ళు బాధ్యతై మరువక
ఓటు వేయవలెను ఓర్పు కలిగి
ప్రజలు మెచ్చినట్టు ప్రభుత యేర్పాటుకై
మరువకూడ దెపుడు మాన్యులార
2) పద్దెనిమిది యేండ్ల ప్రాయంబు మొదలైన
నిండు నూరు యేండ్లు నిండుగైన
ఓటు వేసినంత వొళ్ళంత పులకింత
మనిషి జన్మలోన మాన్యులార
3) ప్రజలు ఒకటిగను ప్రజాస్వామ్య దేశాన
చాటు ఓటునందు సమరముండు
గెలుపు ఓటమందు పలుమార్లు చర్చలు
మంచి విజయమొందు మాన్యులార
4) మధ్య మాంసమనుచు మచ్చిక చేయుచు
ధనము పంచినంత ధర్మమవదు
కులమతముల పేర కుట్రలు పన్నినా
మంచి గెలుచునోయి మాన్యులార
5) పెద్ద, యువతలంత బుద్దిగా ఓటేసి
నీతి పరులవైపు నిలువవలెను
భారతాంబ ఒడిన బంగారు ఇంకుతో
మంచి తీర్పు కనుము మాన్యులార
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి