జీవిత సత్యాలు; - సి.హెచ్.ప్రతాప్
 మన వెనుక ఉన్న డబ్బు
ముఖాలకు వున్న అందం
సిరి సంపదలు, భోగభాగ్యాలు
పదవి, అధికారం,కర్రపెత్తనం
ఏదీ శాశ్వతం కాదు
అసలు మన ఉనికే శాశ్వతం కాదు
ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చి
ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాము
కదిలిపోమంటున్న కాలం
ఆగమంటున్న ప్రాణం
రెండింటి మధ్య పొత్తు లేక
నలిగిపోతున్న జీవితం కూడా అశాశ్వతం
జరిగిన దాన్ని గురించి చింతించక
మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని
ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది
జీవితం చాలా కష్టమైన పరీక్ష
చాలామంది విఫలం చెందటానికి కారణం
ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి
చిమ్మ చీకటి భయపడుతుంది.
నిరంతరం కష్టపడేవాడిని చూసి
ఓటమి భయపడి తోక ముడుస్తుంది
చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది.
కానీ జీవితం ముందు పరీక్ష
పెట్టి తర్వాత పాఠం నేర్పుతుంది.
తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్
తుది శ్వాస విడుస్తూ ఎడిపిస్తావ్
రెండు ఏడుపులు మధ్య
నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం  

కామెంట్‌లు