సుప్రభాత కవిత ; - బృంద
ఆకాశాన వెలిగే వాడూ
అందరి క్షేమం చూసేవాడు
అన్నిటి బ్రతుకూ నడిపేవాడు
ఆప్తమిత్రుడంటి ఆదిదైవము

ఆగమించువేళ ఆకసాన
అరుణ వర్ణపు రంగవల్లులేసి
అందమైన  మేఘమాలలల్లి
అందలం ఎక్కించి ...

అంబరవీధిని ఊరేగింపుగా
అపురూపంగా పయనింపచేసి
అడుగులకు మడుగులొత్తి
అపరంజి గొడుగుపట్టి

అవని అంతటా అనుగ్రహం
అహరహం కురిపించమని
అభ్యంతరాలు లేక ఆదుకోమని
అభ్యర్థనలు చేస్తూ

అనయమూ కనికరము
అవిరళంగా కలిగి వుండమనీ
ఆక్షేపణలు లేని అపేక్షను
అనవరతమూ అందివ్వమని

అన్నలా అభిమానంగా
అక్కలా ఆప్యాయంగా
అమ్మగా కమ్మని అనురాగంగా
అందరినీ అహర్నిశం కాపాడమని

ఆదిత్యునికి అంజలి అర్పిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు