సుప్రభాత కవిత ; -బృంద
రాలుపూల దారిలో
రంగుల జాతరలు
రాయిలా కదలని రాత్రికి
చేయందించే వెలుగులు

కనులలోని కలలన్నీ
కళలు నింపుకుంటుంటే
కలతలన్ని మటుమాయమై
కనులవిందైనట్టు

కంటి అంచున మెరుపులు
పెదవులపై నవ్వులవగా
వెన్నెలంటి చల్లదనం
వేకువలో అందినట్టూ....

ఆకురాలు శిశిరాలను
అనుసరిస్తూ ఆమనులు
అందాల పందిరి వేసి
ఆనందం పంచినట్టూ..

అలసటెంతో కలిగినా
అల్లంత దూరాన 
పొగమంచుల చాటున
పొద్దు పొడిచినట్టూ..

అడుగులు వడివడిగా
ఎడదలు సడిసడిగా
తెమ్మెరై తనువును తాకే
కొత్త ఆశలు ఊరిస్తుంటే

వెలుగుల వైపు నడిచే
పాదాలకు ఉత్తేజంగా
రేపటి కోసం తీసిన
చీకటి రెప్పలకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు