నవ్వు!?- ప్రతాప్ కౌటిళ్యా
నవ్వు -
ఎప్పుడు!!?
అందరూ దుఃఖంతో ఏడుస్తున్నప్పుడు!!!
అదీ
ప్రతీకారం కాదు
దుక్కం పై ప్రతీకారం!!?

నవ్వు-
ఎప్పుడు!!?
భూకంపంతో అందరూ మరణించినప్పుడు.!
అదీ
ప్రతీకారం కాదు
ప్రకృతి పై ప్రతీకారం!!?

నవ్వు
ఎప్పుడు!!?
యుద్ధంలో ఓడిపోయినప్పుడు!!
అది
ప్రతీకారం కాదు
విజయం పై ప్రతీకారం!!?

నవ్వు
ఎప్పుడు!!?
భీకర తుఫానులో సర్వం కోల్పోయినప్పుడు
అది
ప్రతీకారం కాదు
సముద్రంపై ప్రతీకారం!!?

నవ్వు
ఎప్పుడు!!?
జీవితంలో నువ్వు మోసపోయినప్పుడు.!!
అది
ప్రతీకారం కాదు
మోసంపై ప్రతీకారం!!?

నిన్ను చిరంజీవిని చేసింది
నవ్వు కాదు చిరునవ్వు కాదు!!?
నువ్వు మాత్రమే!!! నువ్వే నవ్వు!!?

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు