సౌందర్యలహరి; కొప్పరపు తాయారు
   🌻శంకరాచార్యవిరచిత🌻

త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్
యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్ ॥ 23 ॥

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి ।
సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ-
స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః ॥ 24
23) తల్లీ ! నీ యొడలంతయును ఎఱ్ఱని కాంతిగలదై
మూడు కన్నుల గల దై తన స్తనభారనమ్రమయి 
చంద్ర శకలమును ధరించి ఉండుట చూడ తొలుత 
నీవు ఈశ్వరుని శరీరము శారీర వామార్దమును భరించి ఎంతటితో తనివి నందక మిగిలిన సగమును కూడా ధరించితివి కాబోలు నని  శంక కలుగుచున్నది

24) తల్లీ! బ్రహ్మలోకములను సృజించును, విష్ణువు రక్షించును, శివుడు లయింపజేయును . ఈశ్వరుడు ఈ ముగ్గురను తన శరీరంతోడ లైయము నొందించును. సదాశివుడు నీ కటాక్షమాత్రమున సహాయంగా బడసి ఈతత్వ చతుష్టయమును మరలా నుద్దరించుచున్నాడు. అనగా అనేక కోటి బ్రహ్మాండములను సృజించుట ఎందరో లయించుట
యందును నీవీ భూవిక్షేపమే సదాశివనకు సహాయమొనర్చును.
                        ****🪷****

తాయారు 🪷

కామెంట్‌లు