రాజేంద్రప్రసాద్ కు రాజమండ్రిలో ఘనసన్మానంఆంధ్ర సారస్వత పరిషత్ ఆహ్వానం మేరకుఇటీవల  నారాయణభట్టు వేదిక,రాజమహేంద్రవరం లో నిర్వహించిన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2024 కవిసమ్మేళనములో పాల్గొని కవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్  కమ్మని పాటను వినిపించారు.ఓరోరి తెలుగోడా ఒయ్యారి తెలుగోడా అని పాడిన పాటను  అందరూ విని సంతోషించారు, కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచారు. కవిసమ్మేళనం నిర్వాహకులు అభినందనలు తెలిపారు. వెయ్యిమందికి పైగా పాల్గొన్న కవిసమ్మేళనములో 10వ నంబరుగా ఆహ్వానించారు. సాహిత్యాభిమానులు శ్రీ రాజేంద్రప్రసాద్ సాధించిన విజయాలను తలచుకొని అభినందనలు తెలిపారు. రాజమండ్రి సాహిత్య సమావేశాలను శ్రీ గజల్ శ్రీనివాస్, చైతన్య సంస్థలవ్యవస్థాపకుడు శ్రీ సత్యనారాయణ రాజు, డాక్టర్ ఎస్ ఆర్ కొల్లూరి తదితరులు నిర్వహించారు. శ్రీ ప్రసాద్ గారు ఎన్నో సాహిత్య శిఖరాలను అధిరోహించాలని ప్రశంసించారు.

కామెంట్‌లు