సౌందర్య లహరి;- కొప్పరపు తాయారు
🌻శంకరాచార్య విరచిత🌻
7)   
  క్వణత్కాంచీ దామా కరికలభకుంభస్తననతా 
   పరిక్షీణాం మధ్యే పరిణత శరఛ్ఛంద్ర వదనా !
  ధనుర్భాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః !
  పురస్తాదాస్తాం నః పురమథితు రాహో పురుషికా !!

8)
  సుధాసింధోర్మధ్యే సుర విటపివాటీ  పరివృతే 
  మణిద్వీపే నీపోవవనవతి చింతామణి గృహే !
  శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం  భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీమ్  !
7) చిన్న చిన్న గంటలకు అలంకరించబడిన ఏనుగు, చక్కటి వక్షోభారంతో వంగిన సన్నని అందమైన రూపంతో, మరియు శరదృతువు చంద్ర నీ వంటి ముఖంతో, ఆమె హస్తమున ధరించినటువంటి చెరకు వింటితో , పువ్వులతో చేసిన బాణాలు ధరించి ఉన్న నీ రూపం త్రిపురాంతకుడైన పరమశివుని అహంకార రూపమైన ఆహో పురుషికవు కదా మాత! దయచేసి
అటువంటి రూప దర్శనం చేయు అవకాశము మాకు
అనగ్రహించు తల్లీ !
8)
  అమ్మా! అమృతమయమైన సముద్రం,ఆ సముద్ర
 ము మధ్య, కల్పవృక్షాలవనం ఉన్నది.
 ఆ అమూల్యమైన మణిద్వీప ఉద్యానవనం లో
కదంబ వృక్షాల నడుమ చింతా మణీ ఖచిత దివ్య భవనము లో,త్రికోణాకారము గల మంచమున్నది.ఆ మంచము పై పరమశివుని అంకమున నున్న ధ్యాన జ్ఞాన, ఆనంద తరంగరూపమై నీ వున్నావు.
          అటువంటి నీ జ్ఞాన, ని నతిశయా నంద రూపాన్ని  కొందరు ధన్యులు మాత్రమే సేవిస్తూ ఉన్న
 పవిత్ర  పురుషులు 
           ****🪷*****

కామెంట్‌లు