ప్రకృతి;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సహజత్వం
ఆరోగ్యకరం
ఆస్వాదనీయం
ఆనందమయం

అసహజం
అనర్ధదాయకం
అవనికినష్టకారకం
అనాదరణీయం

అకృత్తిమం
ఆమోదయోగ్యం
అత్యవసరం
ఆరాధ్యనీయం

ప్రకృతిని
ప్రేమించు
పరిసరాలను
పరిరక్షించు

పువ్వులను
పొడగను
పరిమళాలను
పీల్చుకొను

అందాలను
ఆస్వాదించు
ఆనందాలను
అనుభవించు

పచ్చదనం
పరికించు
కమ్మదనం
కళ్ళకివ్వు

కొండలను
కాంచు
కుతూహలము
కాయానికివ్వు

కోనలను
చూడు
కుషీగా
చరించు

సెలయేర్లను
కనుము
సంతసమును
సొంతముచేసుకొనుము

రవిని
దర్శించు
అఙ్ఞానంధకారాలను
పారద్రోలు

నిండుజాబిలిని
వీక్షించు
వదనమును
వెలిగించు

తారకలను
తిలకించు
తళతళలను
తనువుకివ్వు

అంబుధిని
అవలోకించు
కెరటాల్లా
ఎగిసిపడు

ప్రకృతి
పరమాత్మునివరం
పగిది
ప్రతినిత్యంపూజనీయం

ప్రకృతినిప్రేమించు
ప్రతినిత్యంపరికించు
పవిదిప్రాముఖ్యమును
ప్రపంచానికిచాటు


కామెంట్‌లు